తిరుమల వెంకన్న సన్నిధిలో మంత్రుల అత్యుత్సహం విమర్శలకు దారి తీస్తోంది. శ్రీవారి సన్నిధి వద్దే మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్,ఏకాదశి పర్వదినాలు ఒక్కే రోజు వచ్చాయని అన్నారు. మరో మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ శ్రీవారు, ఏసు క్రీస్తు, అల్లా ఆశీస్సులు జగన్ కు వుండాలని కోరుకుంటున్నానని అన్నారు.
అన్యమత ప్రస్తావన తీసుకురాకూడదు అనే టీటీడీ నిబంధనలు పెడచెవిన పెట్టిన నారాయణ స్వామి అక్కడ శుభాకాంక్షలు చెప్పడంతో మంత్రుల తీరు పై భక్తులు మండి పడుతున్నారు. ఇక ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి టీటీడీ విఐపిలకు పెద్ద పీఠ వేసింది. కోవిడ్ నిబంధనల పేరుతో సామాన్య భక్తుల దర్శనం పై కోత విధించింది టీటీడీ. ప్రముఖుల ఒత్తిడిని తట్టుకోలేక రెఫెరల్స్ కు శ్రీవాణి ట్రస్టు క్రింద తిరిగి నేడు భారీగా టిక్కెట్లను జారీ చేసింది టీటీడీ.