టక్ జగదీష్: కత్తి పట్టుకుని భోజనం ముందు కూర్చున్న నాని.

-

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని నుండి వస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. లాక్డౌన్ తర్వాత శరవేగంగా చిత్రీకరణని మొదలుపెట్టింది. ఐతే ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. క్రిస్ మస్ కానుకగా టక్ జగదీష్ నుండి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. భోజనం ముందు కూర్చున్న నాని, చేతిలో కత్తి పట్టుకుని కూర్చున్నాడు.

ఫార్మల్ లుక్ లో చొక్కా టక్ చేసుకుని కూర్చున్న నాని కళ్ళలో ఉగ్రం కనిపిస్తుంది. అది ఎవరి మీదా, ఎందుకు? భోజనం చేసేటపుడు కత్తి ఎందుకు పట్టుకున్నాడనేది సినిమా విడుదలయితేనే తెలుస్తుంది. ఏప్రిల్ నెలలో టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ మేరకు పోస్టర్లోనే ప్రకటించారు. నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version