తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ దర్శనాలకు ఎంత టైమ్‌ అంటే ?

-

తిరుమల భక్తులకు శుభవార్త…ఇవాళ దర్శనాలకు వేచి ఉండాల్సిన పనిలేదు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి వుండే అవసరం లేకుండా… నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. దీంతో తిరుమల భక్తులు.. త్వరగానే శ్రీ వారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక నిన్న శ్రీవారిని 65, 299 మంది భక్తులు దర్శించుకున్నారు. 20, 297 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు గా నమోదు అయింది.

tirumala

కాగా, తిరుమల అభిషేక టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన దళారి అరెస్ట్‌ అయ్యారు. తిరుమల శ్రీవారి అభిషేక టిక్కెట్లు ఇప్పిస్తానని భక్తులను మోసం చేసిన దళారిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిజామాబాద్ కు చెందిన సాయి చంద్ అనే భక్తుడు వద్ద అభిషేకం టిక్కెట్ల పేరుతో లక్షా 5 వేలు వసూలు చేశాడు దళారి లలిత్. టిక్కెట్లు ఇప్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దళారిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

  • తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి వుండే అవసరం లేదూ నేరుగా శ్రీవారి దర్శనం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65, 299 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 20, 297 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.75 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version