తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమలలో 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం ఆలయాన్ని శుభ్రపరచి ఈరోజు ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

దీంతో తిరుమలలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిన్న శ్రీవారిని 27,410 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,656 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. నడక దారిన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుందని టిటిడి సంస్థ పేర్కొంది. నడక దారిన వచ్చే భక్తులు జాగ్రత్తగా రావాలని ఆలయ అధికారులు పేర్కొన్నారు.