పిల్లలు చిన్నపాటి కడుపునొప్పి వచ్చిన వాంతులు చేసుకున్న తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. తమ పిల్లలు పడుతున్న బాధను చూసి తట్టుకోలేరు. పిల్లల్లో కడుపు ఇన్ఫెక్షన్లు చాలా తరచుగా వస్తుంటాయి. కానీ దీనికి గల కారణాలు నివారణ మార్గాలు చాలామందికి తెలియదు. కేవలం శుభ్రత లేకపోవడం వల్లే ఇవి వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ దీని వెనుక ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సరైన సమయంలో వాటిని గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలను ఈ సమస్యల నుంచి కాపాడవచ్చు. మరి పిల్లల్లో కడుపు ఇన్ఫెక్షన్లకు గల అసలు కారణాలను వాటిని ఎలా నివారించాలో వివరంగా తెలుసుకుందాం
వైరల్ ఇన్ఫెక్షన్లు : రోట వైరస్, నోరో వైరస్ వంటివి పిల్లలు వాంతులు విరోచనాలకు ప్రధాన కారణాలు. ఈ వైరస్ లు ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతాయి. దీనిని నివారించడానికి పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి. వైరస్ టీకా పిల్లలకు వేయించాలి.
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ : సాల్మోనెల్లా, ఈ-కోలి వంటి బ్యాక్టీరియాలు సరిగా ఉడికించని ఆహారం కలుషితమైన నీటి ద్వారా పిల్లలు శరీరంలో ప్రవేశిస్తాయి. దీనివల్ల తీవ్రమైన విరోచనాలు జ్వరం వస్తాయి బ్యాక్టీరియాని నివారించడానికి ఆహారాన్ని బాగా ఉడికించాలి. పిల్లలకు శుభ్రమైన ఫిల్టర్ చేసిన నీరు మాత్రమే ఇవ్వాలి.

పరాన్నజీవులు (Parasites): జియార్డియా వంటి పరాన జీవులు కరిష్టమైన నీటి ద్వారా వ్యాపిస్తాయి. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, విరోచనాలు వస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఆడుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
శుభ్రత లేని వాతావరణం : మురికిగా ఉన్న బొమ్మలు పిల్లలు తరచుగా పట్టుకునే వస్తువుల ద్వారా క్రిములు వ్యాపిస్తాయి. పిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.అందుకే పిల్లల గది బొమ్మలు చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.
పిల్లల్లో కడుపు ఇన్ఫెక్షన్ నివారించడానికి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆహారాన్ని సరిగా ఉడికించడం శుభ్రమైన నీటిని తాగించడం, పిల్లలకు చేతులు కడుక్కోవడం, అలవాటు చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అని చాలా వరకు నివారించవచ్చు.