దుర్గమ్మ ఆలయ అధికారుల కీలక నిర్ణయం..

-

విజయవాడ ఇంద్రాకీలాద్రి దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్ప‌టికే తిరుమ‌ల ఆల‌యాన్ని టొబాకో ఫ్రీ జోన్‌గా ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా విజ‌య‌వాడ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య ప‌రిస‌రాల‌ను కూడా పొగాకు నిషేధిత ప్రాంతంగా ప్ర‌క‌టించింది. ఈ నిబంధ‌న‌లు ఈ నెల 26 నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు శ‌నివారం ఆల‌య ప‌రిస‌రాల్లోనే వెల్లడించారు.

ఈ నిషేధం ప్ర‌కారం ఆల‌య మెట్ల మార్గం నుంచి కొండ పై భాగం వ‌ర‌కు పొగాకు ఉత్ప‌త్తుల వినియోగంతో పాటు విక్ర‌యాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞ‌లు ఉల్లంఘించే వారిపై కనిష్ఠంగా రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.200 వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆల‌య అధికారులు, సిబ్బందితో పాటు ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు కూడా దీనిపై అవ‌గాహ‌న కల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version