ఆగని కరోనా విలయతాండవం…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మని దేశాల్లో కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. మన దేశంలో కూడా అంతకంతకు కరోనా వైరస్ తన విశ్వరూపం ప్రదర్శిస్తుంది. 26,35,719 మందికి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సోకింది. అమెరికాలోనే ఏకంగా 8 లక్షల మందికి కరోనా వచ్చింది.

అక్కడ మరణాలు కూడా 50 వేలకు దగ్గరగా ఉన్నాయి. న్న ఒక్క రోజే కొత్తగా 29,973 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 2,341 మంది అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. యూకేలో 763, ఫ్రాన్స్‌లో 544, ఇటలీలో 437, స్పెయిన్‌లో 435, బెల్జియంలో 264, జర్మనీలో 229, స్వీడన్‌లో 172, బ్రెజిల్‌లో 165, మెక్సికోలో 145, కెనడాలో 140 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం 1,84,066 మంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు. 56,686 మంది ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. మన దేశంలో కూడా కేసులు 20 వేలు దాటాయి. ఇవి మరింతగా విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణాలో వెయ్యికి చేరువలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 813 మందికి కరోనా వైరస్ సోకింది. మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version