బంగారం ప్రియులకు శుభవార్త.. దిగివచ్చిన పసిడి..

-

బంగారం కొనాలనకుంటున్న వారికి శుభవార్త. పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర ఈరోజు నేలచూపులు చూసింది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి రేట్లు పడిపోయాయి. మే 27న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గింది. దీంతో ఈ గోల్డ్ రేటు (Gold Rate) 10 గ్రాములకు రూ. 51,980కు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు (Gold Price Today) రూ. 250 తగ్గింది. రూ. 47,650కు క్షీణించింది. కాగా బంగారం ధర గత మూడు రోజుల్లో రూ. 900కు పైగా ర్యాలీ చేసిన విషయం తెలిసిందే.

వెండి రేటు కూడా పడిపోయింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 500 తగ్గింది. దీంతో దీని రేటు రూ.66 వేలకు క్షీణించింది. కాగా వెండి రేటు నిన్న రూ. 400 పరుగులు పెట్టిన విషయం మనకు తెలుసు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1847 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర 0.04 శాతం తగ్గింది. దీని రేటు ఔన్స్‌కు 21.97 డాలర్ల వద్ద ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version