గత కొన్ని రోజులుగా ఇష్టారీతిన పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. భారీ తగ్గుదల కాకపోయినా ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించే విధంగానే తగ్గాయి బంగారం ధరలు. అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా ధరలు పెరిగినా మన దగ్గర కాస్త డిమాండ్ తగ్గిన నేపధ్యంలో బంగారం ధర తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గుదలతో రూ.45,890కు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… 10 గ్రాముల బంగారం ధర రూ.240 తగ్గడంతో… రూ.42,070కు తగ్గింది. దక్షిణాదిన కీలకమైన హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గడంతో… రూ.45,890కు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే…
10 గ్రాముల బంగారం ధర రూ.240 తగ్గడంతో రూ.42,070కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ రూ.250 మేర తగ్గింది బంగారం ధర. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గడంతో… రూ.42,950కు దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గడంతో రూ.44,150కు తగ్గింది. వెండి ధర విషయానికి వస్తే రూ.1130 తగ్గడంతో… రూ.49,950కు క్షీణించింది. మంగళవారం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.