భద్రాచలం రామయ్య కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరు ఉన్న భద్రాద్రిలో రామయ్య కల్యాణ మహోత్సవాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు సాధాసీదా సాగిన కల్యాణం.. ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు, ఆటంకాలు లేకుండా.. కన్నుల పండగా సాగింది. ఆదివారం కల్యాణం ముగిసిన అనంతరం రామయ్య తిరు వీధి సేవ కూడా ఘనంగా సాగింది.
అలాగే చంద్ర ప్రభ వాహనంపై సీత రాములను ఊరేగించి భక్తులను దర్శనం కల్పించారు. కాగ నేడు రామయ్య మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ మహా పట్టాభిషేక మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ముఖ్య అతిథి గా రానున్నారు. అలాగే మహా పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ ఉన్న నేపథ్యంలో భక్తులను అనుతిస్తున్న విషయం తెలిసిందే.