హాస్య బ్రహ్మ, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా..?? ఆయన ఏంటీ బీజేపీ నుంచీ ఉండబోతోందా..?? టీడీపీ, వైసీపీ, జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలని కాదనుకుని బీజీపీ జెండా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అందుకు కారణం కూడా లేకపోలేదట. తాజాగా బ్రహ్మానందం పాల్గొన్న ఓ ప్రచార కార్యక్రమం ఈ అనుమానాలకి తావిస్తోంది అంటున్నారు పరిశీలకులు.
రాజకీయాల్లోకి సినిమా నటులు రావడం కొత్తేమి కాదు. అయితే స్థానికంగా ఉన్న పార్టీలని కాదనుకుని మరీ బీజేపీ పంచన చేరడానికి ప్రత్యేక మైన కారణాలు ఏమి ఉన్నాయి అనేదే సందేహం. కార్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ కి మద్దతుగా ఆ పార్టీ తరుపున నిలబడిన డాక్టర్ సుధాకర్ కి ప్రచారం చేశారు. చిక్క బల్లాపురా, బాగేపల్లి , గౌరీ బిదనూరు వంటి ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వారు అధికంగా ఉంటారు కాబట్టి అక్కడికి సినిమా నటుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
గతంలో కూడా ఆయా ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ , చిరంజీవి వంటి అగ్ర హీరోలు కూడా ప్రచారం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే బ్రహ్మానందం బీజేపీ తరుపున అక్కడ ప్రచారం చేయడం ఏపీలో బ్రహ్మానందం రాజకీయ ఎంట్రీ సిద్దమయ్యింది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. బ్రాహ్మీ ఏపీలో బీజేపీ తరుపున కీలక బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో కూడా బ్రహ్మానందం రాజకీయాల్లోకి వస్తరంటూ జోరుగా ప్రచారం జరిగినా బ్రాహ్మీ పెద్దగా స్పందిచలేదు. మరి ఇప్పుడు ఈ ప్రచారాన్ని ఖండిస్తారో మౌనం అంగీకరంలా నిమ్మకుంటారో వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు.