Rajasekhar: సంక్రాంతి బ‌రిలో మ‌రో హీరో.. పోటీలో నెగ్గేనా?

-

Rajasekhar: టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్ గ‌రుడవేగ మూవీ స‌క్సెస్ తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర‌వాత క‌ల్కికి కూడా మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ స‌క్సెస్ తో వ‌రుస పెట్టి.. సినిమాలు చేస్తున్నాడు. రాజ‌శేఖ‌ర్. తాజాగా ఈ సీనియ‌ర్ హీరో ‘శేఖర్’ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒక‌టి టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఆ అప్ డేట్ ప్ర‌కారం.. సీనియర్ హీరో రాజశేఖర్ తన సినిమా ‘శేఖర్’ ను సంక్రాంతి బ‌రిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నార‌న్నట. థియేటర్లు దొరికితే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. లేదంటే.. జనవరి రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నర‌ట‌. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన థ్రిల్ల‌ర్ జోసెఫ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల సినిమాలు నిలిచాయి. వీరి మ‌ధ్య భారీ ఎత్తున పోటీ నెల‌కొంది. ఒక వైపు ఆర్‌.ఆర్‌.ఆర్, మ‌రోవైపు.. రాధే శ్యామ్ లు గ‌ట్టి పోటినివ్వ‌నున్నాయి. భీమ్లా నాయ‌క్‌, స‌ర్కారు వారి పాట సినిమాలు సైతం ఇప్ప‌టికైతే సంక్రాంతికే వ‌స్తున్నాయి. మ‌రో వైపు బంగార్రాజు కూడా త‌గ్గేదేలే అన్న‌ట్టున్నాడు. వీట‌న్నింటి మ‌ధ్య మ‌రో సినిమాకి చోటే లేదు. ఈ పోటీ నుంచి భీమ్లా నాయ‌క్‌, స‌ర్కారు వారి పాట‌.. త‌ప్పుకున్న‌ట్టు టాక్. అయితే ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ `శేఖ‌ర్‌` సినిమాని ఈ పండ‌క్కి విడుద‌ల చేయాల‌ని సిద్దం కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లుగ‌జేస్తుంది. ఈ సంక్రాంతి కి సినిమాల‌తో తెలుగు రాష్ట్రాల్లో 500 కోట్ల రూపాయల కలెక్షను సాధించే అవకాశాలు ఉన్నట్టు అంచ‌నా.

Read more RELATED
Recommended to you

Exit mobile version