హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ డబ్బు సంచుల్ని, మద్యం సీసాలను పంచినా హుజూరాబాద్ ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడ్డారని, ఈ గెలుపు హుజూరాబాద్ ప్రజలదని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోరికను హుజూరాబాద్ ప్రజలు నెరవేర్చారని తన గెలుపు గురించి అన్నారు. తోలు వలిచి చెప్పులు కట్టించినా… హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్కు ప్రజలన్నా.. ప్రజాస్వామ్యం అన్నా లెక్కలేదని విమర్శించారు. మధ్యం సీసాలు, డబ్బు సంచులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. చిన్న ఉద్యోగస్తున్ని కూడా తమకు మద్దతు ఇవ్వాలని హుకూం జారీ చేసి అరాచకం స్రుష్టించారని అన్నారు.
చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ప్రజల రుణం తీర్చుకోలేను- ఈటెల రాజేందర్
-