టాలీవుడ్ హీరోల డ్యాన్స్ వీడియో వైరల్.. ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్, రామ్ చరణ్, చిరంజీవి..!

-

టాలీవుడ్ స్టార్ హీరోల చిందేస్తున్న వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ‘విక్టరీ ట్రెండ్స్’, ‘‘టాలీవుడ్ హీరోస్’’ అనే క్యాప్షన్ తో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అది కాస్త నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో రామ్ చరణ్, వెంకటేశ్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, రవితేజ, శ్రీకాంత్ చిందులేస్తు్న్నారు.

ఈ వీడియో చూసి నెటిజన్లు, సినీలవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో పాతదే అని పలువురు నెటిజన్లు ధ్రువీకరిస్తున్నారు.

ఓల్డ్ వీడియో అయినప్పటికీ హీరోలందరిని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. వీడియోలో డ్యాన్స్ చేయడానికి రామ్ చరణ్ మొహమాట పడుతుండగా వెంకటేశ్ వెళ్లి రామ్ చరణ్ ను తీసుకొచ్చారు.

ఇక ఆ తర్వాత రామ్ చరణ్ మెడలో ఉన్న శాలువాను తీసేశాడు చిరంజీవి. అలా సరదాగా హీరోలందరూ చిందులేస్తున్నారు. ఇది చూసి జనాలు , సినీ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఓ ప్రైవేటు ఫంక్షన్ లో ఇలా హీరోలందరూ కలిసినట్లు తెలుస్తోంది. ఇలా హీరోలందరూ కలిసి మెలిసి ఉండాలని, ఆరోగ్యకరమైన వాతావరణం ఇండస్ట్రీలో ఉండాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఇరగదీశారని నెటిజన్లు పోస్టులు పెడుతూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version