మీడియా మొఘల్ రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావుపై టాలీవుడ్ లో సటైర్లు వెల్లువెత్తుతున్నా యి. ఆయనకు ఇంత ఉదార హృదయం ఉందని తాము ఊహించలేదంటూ.. కళ్లు పెద్దవి చేసి మరీ చర్చిం చుకుంటున్నారు. నిజానికి ఇటు మీడియాలో కానీ, అటు టాలీవుడ్ లో కానీ భీష్ముడిగా భావించే రామోజీని ఎందుకు ఇలా భావిస్తున్నారు? అసలు ఎందుకు సటైర్లు వేస్తున్నారు? ఏం జరిగింది? అనే విషయాలు పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. మీడియాలోనే కాకుండా సినీ రంగంలోను, టీవీ రంగంలోనూ కూడా రామోజీ తనదైన శైలిలో వెలుగుతున్నారు.
రామోజీ ఫిలిం సిటీ నిర్మించి.. నిత్యం పదుల సంఖ్యలో టీవీ సీరియళ్లు నిర్మించేందుకు, టాలీవుడ్ నుం చి బాలీవుడ్, హాలీవుడ్ వరకు సినిమాలను తీసేందుకు ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా కేవ లం డబ్బు, స్క్రిప్టుతో వెళ్తే అద్భుతమైన చిత్రరాజంతో బయటకు వచ్చే ఏర్పాట్లు చేశారు. నిజానికి భూతల స్వర్గం వంటి రామోజీ ఫిలిం సిటీ.. పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. ఇలాంటి చోట కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఏపీ, తెలంగాణల నుంచే కాకుండా అర్హతులున్న వారు వివిధరాష్ట్రాల్లో ఉన్నా..వెతికి తెచ్చి ఉద్యోగాలు ఇచ్చారు.
తాజాగా మాత్రం కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ మూతబడినట్టే.. రామోజీ వారి ఫిలింసిటీ కూడా మూతబడింది. దీంతో ఉద్యోగులు వీధిన పడ్డారు. ఇదిలావుంటే, టాలీవుడ్ కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి. ఇదే పని చేసి ఉంటే, నిత్యం వేల కోట్లలో రామోజీ ఫిలిం సిటీ ఆర్జన ఉంటుంది. ఇక, టాలీవుడ్ నిలిచిపోవడంతో కార్మికులకు ఏదైనా సాయం చేయాలని చిరంజీవి చారిటీని ఏర్పాటు చేశారు. దీనిలో వచ్చే నిధులను కార్మికులకు ఇచ్చి వారిని కష్టకాలంలో ఆదుకోవాలని సంకల్పించారు.
అయితే, నిత్యం కోట్లు ఈ రంగం నుంచే సంపాయించుకునే రామోజీ.. తాజాగా విరాళం ఇచ్చారు. దీనిపైనే టాలీవుడ్‌లో ఆయన ఉదారతపై సటైర్లు పేలుతున్నాయి. కారణం ఏంటంటే.. గీసిగీసి ఆయన పది లక్షలు ఇచ్చి ప్రచారం చేసుకోవడమే!! ఇదే టాలీవుడ్‌పై నిత్యం వందల కోట్లు సంపాయించుకున్న రామోజీ.. కార్మికులు కష్టాల్లో ఉంటే కేవలం పది లక్షలు విదిలించి చేతులు దులుపుకొంటారా? అంటూ సీనియర్ నటులే కస్సుబుస్సులాడుతుండడం గమనార్హం.