“చిరంజీవి కి అప్పజెప్పడం ఏంటి అసలు” కోపంగా ఉన్న తెలుగు ఇండస్ట్రి ?

-

ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్….మెగాస్టార్ చిరంజీవి నీ మరియు కింగ్ నాగార్జున ని కలవడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం నుండి అన్ని విధాల సహకారం అందుతుందని ఇద్దరు హీరోలకు తలసాని తెలపడం జరిగింది. అంతేకాకుండా నంది అవార్డుల గురించి మరియు చిన్న హీరోలకు సినిమా హాల్లో విషయంలో వస్తున్న ఇబ్బందుల గురించి కూడా తలసాని చిరంజీవితో మరియు నాగార్జున తో మాట్లాడటం జరిగింది.

ఆ బేటి అయిన తర్వాత తాజాగా నంది అవార్డుల చైర్మన్ గా ఇండస్ట్రీ నుండి ఆ పదవికి చిరంజీవి పేరు నమోదు కావటంతో వార్తలు రావడంతో ” చిరంజీవి కి అప్పజెప్పడం ఏంటి అసలు ” కోపంగా అంటూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ప్రముఖులు మండిపడుతున్నారు. నంది అవార్డుల కమిటీ చైర్మన్ పదవిలో చిరంజీవి ఉండాల్సిన వ్యక్తి కాదని…ఇండస్ట్రీలో పని పాట లేని వాళ్ళు ఆ పదవిలో ఉంటారని కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కామెంట్ చేస్తున్నారు.

నంది అవార్డుల సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా చిరంజీవి ఎంపిక అయినట్లే అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ సీరియస్ గా ఉంది. మెగా ఫ్యాన్స్‌ ఈ విషయమై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆ పదవిలో ఉంటే లేనిపోని వివాదాలు చిరంజీవిపై పడతాయి అనవసరమైన వివాదాలు తల పైకి వస్తాయి అంటూ చాలామంది చిరంజీవికి ఆ పదవి ఇవ్వడం పట్ల రావడం పట్ల వస్తున్న వార్తలపై మండిపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నంది అవార్డుల కమిటీ చైర్మన్ పదవి చిరంజీవికి ఏ మాత్రం సూట్ కాదని ఇండస్ట్రీ అంతా గగ్గోలు పెడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version