మూడో ముప్పుకు ముందే జాగ్రత్త పడుతున్న తెలంగాణ ప్రభుత్వం…

-

దేశంలో ఓ వైపు కరోనా కేసులు తగ్గుతుంటే సంతోషపడాలో.. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరగుతుంటే ఆందోళన పడాలో తెలియని పరిస్థితి జనాలది. మరోవైపు ఓమిక్రాన్ తో థర్డ్ వేవ్ వస్తుందనే వాదనలను వినిపిస్తున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతం దేశంలో రోజూ వారీ కేసులు 10 వేల కన్నా తక్కువగానే వస్తున్నాాయి. కానీ రానున్న మూడు నెలలు చాలా కీలకం అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణ వైద్యశాఖ కూడా ఫిబ్రవరి వరకు కరోనా పీక్ స్టేజ్ కి వెళ్లే అవకాశం ఉందని అంచానా వేస్తోంది. దీంతో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. దీని కన్న ముందుగానే మూడో ముప్పును ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేస్తూనే… ఆసుపత్రుల్లో కరోనా సన్నద్ధత చర్యలు తీసుకుంటోంది. సంక్రాతి వరకు కరోనా కేసుల సంఖ్య పెరుగవచ్చని అంచానాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపి 25,390 పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ కొరత రాకుండా ప్లాంట్ల ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. మాస్కులు, పీపీఈ కిట్లు, అత్యవసర జౌషధాలు అందుబాటులో ఉంచినట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version