ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఉత్తర సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథతో ముందు నుంచి ట్రైలర్స్ తో ఆసక్తి రేపిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కథలో పట్టు ఉండటంతో అంచనాలు లేకపోయినా సరే ఆకట్టుకుంది అనే చెప్పాలి. తిరుపతి ఎస్ఆర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోగా శ్రీరాం నిమ్మల నటించారు. తొలి పరిచయంలోనే శ్రీరాం నటన ప్రేక్షకులను మెప్పించింది.
వెండితెరకు కొత్త అయినా సరే ఎక్కడా కూడా తడబాటు లేకుండా చేసిన అతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. సిని పరిశ్రమ మీద ఆసక్తితో, నటుడు కావాలనే కోరికతో వచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనే చెప్పాలి. కొన్ని సీన్లలో అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డైలాగ్ డెలివరి విషయంలో కూడా శ్రీరాం మెప్పించారు. ఒకరకంగా సినిమాకు ఆయనే పెద్ద ఎసెట్ అని ప్రేక్షకులు అంటున్నారు. హీరోయిన్ తో కొన్ని సన్నివేశాల్లో శ్రీరాం నటనలో పరిణితి చూపించాడు.
జైలు సన్నివేశంలో బ్యాక్ డ్రాప్ చెప్తున్నప్పుడు హావభావాలు ఆకట్టుకున్నాయి. ఇటు క్లాస్ అటు మాస్ ని కూడా తన నటన, బాడీ లాంగ్వేజ్ తో శ్రీరాం మెప్పించారు. ప్రేమ సన్నివేశాలతో పాటు విలన్ అజయ్ ఘోష్ ముందు ఏ మాత్రం తడబాటు లేకుండా నటించాడు. దీనితో టాలివుడ్ కి మరో ఉదయ్ కిరణ్ దొరికేసాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో నటిస్తే అతనికి తిరుగు ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. గ్లామర్ పరంగాను శ్రీరాం ఆకట్టుకున్నారు. ఇలాంటి యువ హీరోలను ప్రోత్సహించాలాని ప్రేక్షకులు కోరుతున్నారు.