టామ్ అండ్ జెర్రీ దర్శకుడు ఇక లేరు…!

-

టామ్ అండ్ జెర్రీ… ఈ తరం పిల్లలకు పెద్దగా పరిచయం లేదు గాని 90లలో పుట్టిన పిల్లలకు ఇది బాగా పరిచయ౦. స్కూల్ నుంచి ఇంటికి వస్తే చాలు దీన్ని ఎక్కువగా చూస్తూ ఉండే వాళ్ళు. దీనికి సంబంధించి తల్లి తండ్రులతో దెబ్బలు తినే వాళ్ళు కూడా అప్పట్లో ఉండే వాళ్ళు. ఆ విధంగా ఇది అప్పట్లో పాపులర్ అయింది. ఇక మనశ్శాంతి కోసం పెద్దలు కూడా దీన్ని ఎక్కువగా చూస్తూ ఉండే వారు అప్పట్లో.

దాని రూపకర్త… దర్శకుడు ఇక లేరు. ఆయన పేరు చాలా మందికి తెలియదు. జీన్ డిచ్ ఆయన పేరు. అమెరికా వైమానిక దళంలో పని చేసిన ఆయన… అక్కడ కొన్ని అనారోగ్య సమస్యలు బయటకు రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌ నగరంలోకి వచ్చేశారు. 1959 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఆయనకు అక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. 95 ఏళ్ళ డిచ్ కి చిత్ర కళల మీద కాస్త ఆసక్తి ఎక్కువగా ఉండేది.

దీనితో ఆయన కార్టూన్స్ ని ఎక్కువగా గీసే వాళ్ళు. మన్రో అనే చిత్రం కూడా కార్టూన్ ఆధారంగా తీసుకొచ్చారు. బెస్టు యానిమేటెడ్‌ షార్ట్ ఫిలింగా 1960లో ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. సీరియల్స్ ఎక్కువగా చూస్తున్న తరుణంలో ఆయన జనాలను కార్టూన్ వైపు దృష్టి మరల్చారు. టామ్‌ అండ్‌ జెర్రీ 13 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించగా ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. ఏప్రిల్ 16 న ఆయన తన ఇంట్లోనే మరణించారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version