ఏపీ విద్యార్థులకు అలర్ట్.. రేపే జగనన్న వసతి దీవెన

-

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు మరియు వారి తల్లులకు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు జగనన్న వసతి దీవెన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏపీ లో రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్‌ నొక్కి జమ చేయనున్నారు . అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. అయితే, రేపు జమ చేస్తున్న రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కాగా, ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం.

ఒక కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం, నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. పేదరికం కారణంగా ఏ విద్యార్ధి ఉన్నత చదువులకు దూరం కాకూడదు. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో.. ఒకవైపు పేద విద్యార్ధుల చదువులకయ్యే ఫీజు ఖర్చులను పూర్తిగా భరించడంతో పాటు మరొకవైపు భోజన, వసతి ఖర్చులకు కూడా వారు ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం జగనన్న వసతి దీవెన తీసుకొచ్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version