రేపే సుప్రీమ్ కోర్ట్ లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ… ఏమి జరుగుతుందో ?

-

చంద్రబాబు నాయుడు గత నాలుగు వారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. కాగా జైలు నుండి బయటపడడానికి ఎన్నో విధాలుగా చంద్రబాబు మద్దతుదారులు మరియు లాయర్లు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ ను హై కోర్ట్ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. దానితో చంద్రబాబు లాయర్లు సుప్రీమ్ కోర్ట్ లో దీనిని ఛాలెంజ్ చేశారు.. కాగా ఈ పిటిషన్ పై విచారణ జరిగే సమయం కూడా వచ్చేసింది. రేపు సుప్రీమ్ కోర్ట్ లో జస్టిస్ బేలా త్రివేది మరియు జస్టిస్ అనిరుద్ బోస్ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. కాగా ఈ పిటిషన్ ను రేపటి షెడ్యూల్ ప్రకారం చివరిదిగా లిస్ట్ చేసినారు అని సమాచారం అందుతోంది.

మరి ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపు లాయర్లు మరియు సిఐడి తరపు లాయర్లు ఏ విధంగా విధించనున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక దేశవ్యాప్తంగా చంద్రబాబు అభిమానాలు రేపటి సుప్రీమ్ కోర్ట్ తీర్పు కోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version