తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎందుకు మారుస్తున్నారు అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. అనంతరం మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగిన రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదు అని తెలిపారు. ఇప్పుడు కొత్తగా విగ్రహం ఆవిష్కరణ చేస్తామని ..కేసీఆర్ ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేసేది.. తెలంగాణ తల్లి యా, కాంగ్రె స్ తల్లి యా తెలియదని ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారని ఆగ్రహించారు కేటీఆర్.. ఇప్పటికే వేల విగ్రహాలు ప్రతిష్టించి ఉన్న తెలంగాణ తల్లి రూపుని మారుస్తాం అంటే ఎలా…అని నిలదీశారు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామని స్పష్టం చేశారు. సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం కూడా మారుస్తామని తెలిపారు కేటీఆర్.