ఈ సీజన్‌లో మనకు లభించే అనేక రకాల పండ్లలో లిచి పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు ప్రస్తుతం ఎక్కువగా దొరుకుతాయి. ఇవి చాలా తియ్యని రుచిని కలిగి ఉంటాయి. అలాగే మనకు ఇవి అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని నేరుగా తినవచ్చు, జ్యూస్‌లు, డ్రింక్స్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఈ పండ్ల వల్ల మనకు లాభాలు కలుగుతాయి. లిచి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. లిచి పండ్లను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. వీటిని కొద్ది మొత్తంలో తిన్నా సరే.. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. దీంతో శరీరంలో క్యాలరీలు అధికంగా చేరకుండా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గడం సులభతరమవుతుంది.
2. ఈ పండ్లలో ఉండే ఔషధ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. దీంతో చర్మం సంరక్షింపబడుతుంది.
3. మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ఏ వ్యాధి వచ్చినా మన శరీరం పోరాడగలుగుతుంది. అందువల్ల ఆ వ్యవస్థను పటిష్టంగా మార్చుకోవాలి. అందుకు లిచి పండ్లు తోడ్పడుతాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
4. లిచి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. తరచూ ఈ పండ్లను తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరానికి రక్త సరఫరా మెరుగు పడుతుంది.
5. లిచి పండ్లలో ఉండే ఔషధ గుణాలు మన శరీర జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.