స్టార్‌ ఫ్రూట్‌ గురించి మీకు తెలుసా..? వాటిని తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

-

ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పండ్లు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. ఏ పండు ప్రత్యేకత దానిదే. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల మనం అన్ని రకాల పండ్లను సీజన్లకు అనుగుణంగా తినాల్సిందే. ఇక మనకు కొన్ని ప్రత్యేక పండ్లు కూడా ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి. వాటిలో స్టార్‌ ఫ్రూట్‌ కూడా ఒకటి. ఇప్పుడు మనం బయట ఎక్కడ చూసినా ఈ పండు మనకు కనిపిస్తోంది. అయితే ఇంతకీ ఈ పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

  • స్టార్‌ ఫ్రూట్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిలో విటమిన్‌ సి, బి2, బి6, బి9, ఫైబర్‌, పొటాషియం, జింక్‌, ఐరన్‌లు ముఖ్యమైనవి. ఇవి మనకు సంపూర్ణ పోషణను అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
  • శరీరంలో ఎక్కువగా ఉండే నీటిని తొలగించడంలో ఈ పండ్లు అమోఘంగా పనిచేస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి.
  • స్టార్‌ ఫ్రూట్‌లను తినడం వల్ల దగ్గు, కామెర్లు, మలబద్దకం తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
  • డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. కిడ్నీ సమస్యలు దూరమవుతాయి. అలాగే ఆటలమ్మ, తలనొప్పి, తామర వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి.

ఈ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా కూరగా చేసుకుని అయినా తినవచ్చు. ఎలా తీసుకున్నా వీటితో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version