ఖమ్మం పోరు రసవత్తరం..పైచేయి ఎవరిది?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. ఈ సారి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చాలా పార్టీలు రేసులో ఉన్నాయని చెప్పాలి..రాష్ట్ర రాజకీయాలతో పోలిస్తే ఖమ్మం జిల్లా రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్, టి‌డి‌పి, బి‌జే‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, వైఎస్సార్టీపీ..ఇలా ప్రతి పార్టీ రేసులో ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే ప్రధాన పోరు మాత్రం బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుంది.

ఇక ఇక్కడ బి‌జే‌పికి బలం కనిపించడం లేదు..కానీ ఎన్నికల సమయంలోపు కీలక నేతలు బి‌జే‌పిలో చెరిత ఆ పార్టీ రేసులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అటు కమ్యూనిస్టులు, టి‌డి‌పి, వైఎస్సార్టీపీ గెలుపోటములని ప్రభావితం చేస్తాయి. అయితే కమ్యూనిస్టులు..బి‌ఆర్‌ఎస్ పార్టీతో కలిసి వెళ్లడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. దీని వల్ల ఈ సారి ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాస్త పట్టు దక్కే ఛాన్స్ ఉంది. అసలు గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.

ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే కాంగ్రెస్ 6, టీడీపీ 2, బి‌ఆర్‌ఎస్ 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. 4గురు కాంగ్రెస్, ఇద్దరు టి‌డి‌పి, ఒక ఇండిపెండెంట్ బి‌ఆర్‌ఎస్ లో చేరిపోయారు. అయినా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఇక ఇక్కడ వైఎస్సార్టీపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకుని కాస్త చీల్చే ఛాన్స్ ఉంది. అటు బి‌ఆర్‌ఎస్ ఓటు బ్యాంకుని టి‌డి‌పి చీల్చే ఛాన్స్ ఉంది.

ఇక బలమైన నేతలు వస్తే బి‌జే‌పి రేసులోకి వస్తుంది. అటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తన అనుచరులతో బి‌ఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నారు. ఆయన  ఏ పార్టీలో చేరుతారో ఆ పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా ఉన్నాయి. మరి ఈ సారి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version