తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు గవర్నర్ ఇంతవరకు ఆమోదం తెలపలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే పిటిషన్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దృశ్యంత్ ధవే కోర్టుకు తెలిపారు.
గవర్నర్ ప్రసంగం తోనే సమావేశాలు ప్రారంభమవుతాయి అన్నారు. గవర్నర్ ను విమర్శించోద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 3న సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.