ప్రస్తుతం టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్క హీరో ప్యాన్ ఇండియా సినిమా చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ క్రమంలో టీటౌన్ మొత్తం ప్యాన్ ఇండియా నామ స్మరణనే చేస్తుంది. ఒక భాషలో సినిమాతీసి వివిధ భాషల్లో అనువదించడం మాత్రమే కాకుండా యూనివర్శల్ ఎపీల్ ఉన్న కథలను ప్యాన్ ఇండియా సినిమాలుగా మలిచేందుకు తగు శ్రద్ధ తీసుకుంటున్నారు హీరోలు. దీంతో ప్యాన్ ఇండియా సినిమాలకు విపరీతం అయిన క్రేజ్ వస్తుంది. ప్రభాస్ అనే కాదు ఎన్టీఆర్ అనే కాదు కల్యాణ్ రామ్ కూడా ప్యాన్ ఇండియాపై మనసు పారేసుకున్నారు. ఆయన నటిస్తున్న రాబోవు చిత్రాలు అన్నీ ప్యాన్ ఇండియా కోవలోకి చేరేవే!
ప్రస్తుతం ఆయన చేసిన జొమొటో యాడ్ మంచి క్రేజ్ తో పాటు వివాదాలకూ తావిస్తుంది. ఏదేమయినప్పటికీ గతంలో మాదిరిగా వివాదాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు కానీ సినిమాను కానీ యాడ్ ను కానీ తనదైన శైలిలోనే రూపొందించాలన్న తపన అయితే మాత్రం బన్నీలో బాగానే పెరిగింది. ఓవైపు ప్రభాస్ మరోవైపు తారక్, చెర్రీతో పాటు తనుకూడా మరింతగా జాతీయ స్థాయిలో రాణించాలన్నది బన్నీ ప్లాన్. ఇక బన్నీతో పాటు ఇంకొందరు కథానాయకులు కూడా ప్యాన్ ఇండియా ఫ్యాక్టర్ పైనే ప్రేమ మరియు ఆసక్తి పెంచుకుంటున్నారు.
ఓ విధంగా ఇటువంటి ప్రయత్నాలు సినిమా స్థాయిని పెంచడంతో పాటు వివిధ మార్గాలలో ఆదాయ వనరులను పెంచుకునేందుకు (శాటిలైట్, థియేటర్ రైట్స్ , ఓటీటీ) ఓ విధంగా మంచి అవకాశం. అందుకే ప్యాన్ ఇండియా ఫిల్మ్ అనగానే డిజిటల్ మీడియా ప్రమోటర్స్ కు కూడా మంచి వాల్యూ వస్తోంది. వారికి కూడా క్రేజ్ మరింతగా పెరుగుతోంది. తద్వారా ఇన్కం సోర్సెస్ కూడా బాగానే పెరుగుతున్నాయి. ఇదే సమయంలో పరభాషా నటులు సైతం ఇక్కడ నటిస్తూ సినిమా ప్రమోషన్ కు వారెంతో సహకరిస్తున్నారు. ఇవన్నీ మన సినిమా స్థాయిని మరింత పెంచేవే కావడం ఇప్పటి పరిణామంలో ఉన్న సానుకూలత!