ఆంధ్ర రాష్ట్రానికి కశ్మీర్‌గా పేరొందిన లంబసింగిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు. లంబసింగిలోని చింతపల్లిలో కనిష్టంగా 7.5 డిగ్రీలు నమోదవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తట్టులేకపోతున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.
చల్లటి ప్రాంతం కావడంతో టూరిస్టులు లంబసింగికి క్యూ కట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో రూములకు, కాటేజీలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, పర్యాటకుల రాకతో అక్కడి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చింతపల్లిలో కనిష్ఠ డిగ్రీలు, పెరుగుతున్న చలి తీవ్రత. …
👉చింతపల్లిలో ఈరోజు 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
👉తీవ్ర చలితో ఇబ్బంది పడుతున్నా వృద్ధులు, పిల్లలు
👉ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో పెరుగుతున్న పర్యటకులు
For More Updates Download The App Now-https://t.co/iPdcphBI9M pic.twitter.com/PbhtjJ8Mxq— ChotaNews App (@ChotaNewsApp) January 3, 2025