హనుమాన్ విజయ యాత్ర… హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

-

హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో హనుమాన్ విజయ యాత్ర నిర్వహించనున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రత్యామ్నాయ రూట్ వివరాలను తెలుసుకోవచ్చన్నారు. శోభాయాత్ర జరిగే రూట్లలో మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆయన తెలిపారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న ప్రాంతాల గూగుల్ మ్యాప్ ఇదే. శోభాయాత్ర జరిగే రూట్ కూడా ఇదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version