వాహన దారులకు అలెర్ట్… హైదరాబాద్ లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు..

-

కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. హైదరాబాద్ లో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 వ తేదీ ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసు అధికారులు తెలియజేశారు. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రూట్లో వచ్చే వాహనాలను ఖైరతాబాద్, రాజ్ భవన్ల మీదుగా మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.

Traffic Challan

బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ మీదుగా… లక్డీకపూల్ వైపు మళ్లించనున్నట్లు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పోలీసులు కూడా పలు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే ఆంక్షల గురించి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ వివరించారు. పరిమితికి మించి మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ. 10వేల జరిమానాలో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. రెండో సారి పట్టుబడితే రూ. 15 వేల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష, మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version