మందుబాబులకు గుడ్ న్యూస్..ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్

-

మందు బాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. డిసెంబర్ 31వ తేదీన మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తారు అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిసారి డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వాలు.. ఆన్సర్ లు పెడుతూ తొందరగానే వైన్స్ క్లోజ్ చేసేవి. అయితే ఈసారి ఆ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా.. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు, మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.

రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ ఉంటాయని.. కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి వి… చేయకూడదని ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలు రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచాలని జగన్ సర్కార్ పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్ణయాలతో మందుబాబులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version