తూర్పుగోదావరిలో విషాదం.. కొనేరులో స్నానానికి దిగి వ్యక్తి గల్లంతు

-

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొనేరులో స్నానం చేసేందుకు అని వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీరంగపట్నంలో గల ముక్కోరు కోనేరులో స్నానానికి దిగి శ్రీను అనే వ్యక్తి గల్లంతు అయినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీను ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో కొనేరులో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొనేరులో శ్రీను మునిగిపోతుండగా స్థానికులు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news