జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన టేకుమట్ల మండలం రామకిష్టాపూర్ గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం.
అయితే, అదుపు తప్పిన లారీ పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదం సమయంలో లారీలో పత్తి గింజల లోడ్ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కూలీ పనికి వెళ్లిన ఇద్దరు మహిళలు మృత్యు ఒడికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుండగా.. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.