మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ (SYG) అనే మూవీలో నటించాడు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సిద్ధం కానుంది. ఈ క్రమంలోనే తన తరువాతి సినిమా గురించి సాయి ధరమ్ తేజ్ కీలక ప్రకటన చేశారు.తన తర్వాతి ప్రాజెక్టు ఓ తమిళ దర్శకుడితో కలిసి ఉంటుందని రివీల్ చేశారు.
ఈ చిత్రానికి ‘ఇది మామూలు ప్రేమ కాదు’ అనే టైటిల్ అనుకొంటున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా దర్శకుడు ఈ కథపై కసరత్తు చేస్తున్నాడని.. టైటిల్ కి తగ్గట్టుగానే ఇది మామూలు కథ కాదు. సమ్ థింగ్ స్పెషల్!! అని పేర్కొన్నాడు. సంబరాల ఏటి గట్టు లాంటి యాక్షన్ సినిమా తరవాత ఇది సరైన సినిమా.. అని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.