నార్సింగిలో విషాదం.. ముగ్గురు సజీవ దహనం

-

హైదరాబాద్ లోని  నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని పుష్పాగూడలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాషా కాలనీలో ఉన్న రెండు అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, మొదటి అంతస్తులోని ఓ గదిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని స్ట్రెచర్ పై బయటకు తీసుకొచ్చారు.

అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లు సమాచారం. మృతులను సిజిరా (7), సహానా (40), జమీలా (70)గా గుర్తించారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురిని కాపాడారు. కాగా, భవనంలో మూడు గ్యాస్ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత పెరిగింది. గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు తప్పనిసరిగ్గా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version