బట్టతల రావడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టె సమస్యల్లో ఒకటి. చిన్న వయసులోనే బట్టతల రావడం అంటే…? పాపం అది తీరని వేదన. అందుకే ఒక విదార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మాదాపూర్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగి చిన్న కుమారుడు జేఈఈ పరీక్షలకు ఇంటి వద్దే చదువుకుంటున్నాడు. అతని వయసు 18 ఏళ్ళు కాగా కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో,
తీవ్రంగా బాధపడుతున్నాడు, అంతే కాకుండా అతను మనోవేదన చెందుతున్నాడు. ఇటీవల ఇంటర్ పూర్తి చేసి జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. సైనస్ ఆరోగ్య సమస్యతో పాటుగా గత ఆరు నెలలుగా తీవ్రంగా జట్టు రాలిపోతూ క్రమంగా బట్టతలగా అయిపోయింది. చిన్న వయసులోనే బట్ట తల రావడంతో ఈ విషయాన్ని తల్లి తండ్రులకు కూడా చెప్పినా అతనికి ఏ పరిష్కారం దొరకలేదు.
దీనితో జుట్టు రాలిపోతుందని మనోవేదన చెందిన ఆ విద్యార్ధి ఎంత సేపు అయినా బయటకు రాలేదు. సోమవారం ఉదయం అతను స్నానం చేయడానికి అని వెళ్లి, ఎంత సేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని తల్లి వెళ్లి చూడగా, గడి పెట్టి ఉండటంతో, వెంటనే భర్తకు సమాచారం అందించింది. ఇంటికి వచ్చిన అతను స్నానాల గది తలుపులు పగులగొట్టి చూడగా కుమారుడు ఉరివేసుకొని కనిపించాడు. జుట్టు ఊడిపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసాడు.