విషాదం.. భగత్‌సింగ్ మాదిరి అనుకరణలో బాలుడు చివరికి..!

-

భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు‌గాను పోరాడిన యోధుడు భగత్ సింగ్ గురించి భారతీయులందరికీ స్ఫూర్తిప్రదాత. ముఖ్యంగా యువత భగత్ సింగ్ స్ఫూర్తితో భారతదేశం పట్ల ప్రేమను కలిగి ఉండాలని పెద్దలు చెప్తుంటారు. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 సమీపిస్తున్న తరుణంలో పాఠశాలలు, కాలేజీలు, అన్ని ఆఫీసులు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఇలా సమాయత్తమవుతున్న సందర్భంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే..

 

ఉత్తర‌ప్రదేశ్, బుదౌన్ జిల్లాలోని బబత్ గ్రామంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్కూల్‌లో భగత్ సింగ్ నాటకం వేయాలని శివమ్ అనే స్టూడెంట్, అతడి ఫ్రెండ్స్ అనుకున్నారు. ఈ నాటకంలో భగత్ సింగ్ పాత్రను శివమ్ వేయాలనుకున్నాడు. ఈ క్రమంలో భగత్ సింగ్ మాదిరి అనుకరించడం స్టార్ట్ చేశాడు శివమ్. నాటకం చివరలో భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడుతూ తనకు తానుగా ఉరికొయ్యకు వేలాడటం ఉంటుంది. ఈ సీన్ రిహార్సల్స్ కోసం శివం ఓ తాడును తీసుకొచ్చుకున్నాడు. స్టూల్ వేసుకుని ఆ తాడును స్కూల్‌లోని ఓ రూంలో పైన కట్టాడు. ఫ్రెండ్స్ అందరూ చూస్తుండగా భగత్ సింగ్ మాదిరి బాగా యాక్ట్ చేయాలనుకున్నాడు. భగత్ సింగ్‌లా ఫోజులిస్తూ స్టూల్‌పై నిల్చొని తాడును ఉరిగా తన మెడకు వేసుకున్నాడు. ఇక్కడే అనుకోని ప్రమాదం జరిగింది. శివమ్ మెడకు ఉన్న తాడు ఉరి బిగించుకుని కొట్టుకుండగా అది చూసి పిల్లలు యాక్టింగ్ అనుకున్నారు. కానీ, శివమ్ నిజంగానే ప్రాణం కోల్పోయాడు. కొద్దిసేపటి తర్వాత శివమ్ ఇక యాక్టింగ్ చాలు లే..అని పిలిచినా అతడు పలుకలేదు. దాంతో వెంటనే ఆ పిల్లలు పరుగున వెళ్లి శివమ్ తల్లి దండ్రులకు చెప్పగా వారి వచ్చి చూశారు. అయితే, అప్పటికే శివమ్ చనిపోయాడు. దాంతో శివమ్ తల్లిదండ్రులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version