డయల్ ఇన్ నెంబర్ లకు సంబంధించి ట్రాయ్ కీలక ఆదేశాలు…!

-

జూమ్, గూగుల్ మీట్, బ్లూ జీన్స్ వంటి వీడియో-కాలింగ్ యాప్స్ లో డయల్ ఇన్ నంబర్లకు సంబంధించి అంతర్జాతీయ కాల్ చార్జీలు ఖర్చు అవుతున్నాయి అని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో ట్రాయ్ స్పందించింది. ఈ వీడియో కాలింగ్ యాప్స్ లో భాగస్వామ్యం చేయబడిన డయల్-ఇన్ నెంబర్ లు ప్రీమియం నెంబర్ లు లేదా అంతర్జాతీయ ఫోన్ నెంబర్ లు రావడంతో కాల్ చార్జీలు భారీగా ఖర్చు అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో డయల్ ఇన్ నెంబర్లకు సంబంధించి వినియోగదారులకు తగిన హెచ్చరిక ఇవ్వాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది ఈ విషయాన్ని ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక పేర్కొంది. వీడియో-కాలింగ్ అనువర్తనాల్లో డయల్-ఇన్ నంబర్లను అనుకోకుండా ఉపయోగించడం వలన బిల్లుల పెరుగుదల గురించి గతంలో కస్టమర్లకు ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news