ఏపీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి జిల్లాలోని బాలాయపల్లి మండలం జయంపు సమీపంలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. గూడూరు వైపు వెళుతున్న రైలుకు గేదెలు అడ్డురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది.
ప్రమాదంలో కొన్ని గేదెలు మృతి చెందగా రెండున్నర గంటల పాటూ రైలు అక్కడే నిలిచిపోయింది.వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వారు ట్రాక్స్ పునరుద్ధరించారు. అనంతరం రైలు అక్కడి నుంచి గమ్యస్థానానికి బయలు దేరింది. కాగా, ప్రమాదంలో గేదెలు మృతి చెందడంతో యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు.