ఓమైగాడ్.. పట్టాలపై ఆగిపోయిన ఆటోను ఈడ్చుకుపోయిన ముంబై ట్రెయిన్

-

అది లోకమాన్యతిలక్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్. ముంబై నుంచి కాకినాడకు వారానికి రెండు సార్లు వెళ్తుంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 కు ముంబై నుంచి కాకినాడకు బయలుదేరింది. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి గుంటూరు జిల్లాలోని నడికూడి స్టేషన్ కు చేరుకోబోతోంది. కానీ.. ఇంతలోనే 48వ రైలు గేటు వద్ద పట్టాలపై ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టి అలాగే కొంతదూరం ఈడ్చుకుపోయింది. అయితే.. పట్టాలపై ఆగి ఉన్న రైలును గమనించిన రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించినా రైలు ఆగకుండా సుమారు 300 మీటర్ల వరకు ఆటోను ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత రైలు ఆగిపోయింది. అయితే.. ఆటోలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ.. ఆటోలో ఉన్న బియ్యం మాత్రం చెల్లాచెదురైంది. పట్టాల నుంచి ఆటో శకలాలను తీసేశాక మళ్లీ ట్రెయిన్ కదిలింది.

పట్టాలపై ఆటో ఎందుకు ఆగింది..?
పట్టాలపై ఆటో ఎందుకు ఆగిందంటే.. సరిగ్గా ట్రెయిన్ పోయే సమయానికి ఆ గేటు వద్దకు బియ్యం లోడుతో ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు. ట్రెయిన్ వస్తున్నదని.. ఆగాలని గేట్ మెన్ చెప్పినా వినకుండా అతడు ఆటోను పట్టాల మీదికి పోనిచ్చాడు. ఇంతలో పట్టాల మీద కుదుపుకు గురయిన ఆటో పట్టాల మీదనే ఆగిపోయింది. అటు ముందుకు.. ఇటు వెనక్కి వెళ్లలేకపోయింది. ఇంజిన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంతలోనే ట్రెయిన్ వేగంగా వస్తున్నది. ఏం చేయాలో తెలియని డ్రైవర్ ఆటోను అక్కడే వదిలేసి ఆటో దిగి పరారయ్యాడు. అది అసలు మ్యాటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version