Breaking : పట్టాలు తప్పి మరో రైలును ఢీకొన్న ట్రైన్

-

ఓ రైలు మరో లోకల్ ట్రైన్‌ ఢీ కొట్టిన సంఘటన బంగాల్ సియాల్దా సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. వివరాల్లోకి వెళితే.. బంగాల్ సియాల్దా సమీపంలో బుధవారం ఉదయం రాణాఘాట్ లోకల్ రైలు పట్టాలు తప్పి.. మరో లోకల్ ట్రైన్​ను ఢీకొట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన వెంటనే రైలులోని ప్రయాణికులను దించేశారు.

వారంతా రైల్వే లైన్ వెంబడి నడిచి ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నారు. ప్రమాదం దృష్ట్యా అధికారులు ఆ మార్గంలో రైలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇప్పటి వరకు ఏ రైలునూ రద్దు చేయలేదని స్పష్టం చేశారు. సిగ్నలింగ్​లో గందరగోళమే ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు. అసలు కారణమేంటో తేల్చేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశామని తూర్పు రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి ఏకలవ్య చక్రవర్తి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version