తెలంగాణలో ఉన్న 97 ఆర్టీసీ డిపోల్లో ఒక్కో డిపో నుంచి ఐదుగురు చొప్పున ఉద్యోగులతో నేడు కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐదుగురిలో ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలకు కూడా ప్రాతినిధ్యం లభించింది. ఇక కేసీఆర్ తో సమావేశం కానున్న వారికి నిన్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎంను ప్రశ్నించవద్దని, ఆయన చెప్పే ప్రతి అంశానికీ తలూపాలని ఉద్యోగులను హెచ్చరించినట్టు సమాచారం.
జీతాలు, ఇతర నిధుల గురించిగానీ, డిమాండ్ల గురించి గానీ ప్రస్తావించ వద్దని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలు తమకు అవసరం లేదని చెప్పాలని రీజనల్ మేనేజర్లు చెప్పినట్టు, పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఉద్యోగులు కొందరు వ్యాఖ్యానించారు.