Breaking : వికారాబాద్ రిసార్ట్స్ ల్లో ట్రెజర్ హంట్ గేమ్స్.. ఒకరు మృతి

-

వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రిసార్ట్స్ లో డేంజర్ గేమ్స్..ఆడుతూ మరణించారు. ట్రెజర్ హంటు గేమ్ భాగం లో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో నిర్వాహకులు నిర్వహించిన ట్రెజర్ హంటు గేమ్ లో వ్యక్తి మృతి చెందాడు.

పారవేసిన వస్తువును తీసుకురావడమే ఈ గేమ్ టార్గెట్. నిన్న సాయంత్రం గోధుమ గుడాలోని మూన్ లైట్ రిసార్ట్స్ కి చేరుకున్న హైదరాబాద్ కు చెందిన యువకులు.. ఈ గేమ్ ఆడారు. రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టడంతో బావిలో ఆ వ్యక్తి దూకాడు. అయితే ఆ బావిలో దూకిన వ్యక్తి మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version