ట్రెండ్ ఇన్ : తెలుగుదేశంలో చేయాల్సిన మార్పులివే ! ఎనీ డౌట్స్

-

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పుట్టిన్రోజు. పండుగ రోజు.. పసుపు పార్టీ లోగిళ్ల‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్న రోజు కూడా ! ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో న‌డుస్తున్న లేదా ప‌రుగులు తీస్తున్న లేదా ప‌రుగులు తీయాల‌నుకుంటున్న పార్టీ నేర్చుకోవాల్సినివి ఎన్నో ఉన్నాయి. మ‌రియు దిద్దుకోవాల్సిన‌వీ ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే ప్ర‌జాక్షేత్రంలో పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అని కాదు స‌మ‌ర్థ‌రీతిలో ప‌నిచేసి అధికార పార్టీని ఎదుర్కోగ‌ల‌దా అన్న‌దే ఓ పెద్ద సందేహం. నో డౌట్.. చంద్రబాబు మంచి లీడ‌ర్.. విజ‌న్ ఉన్న లీడ‌ర్.. ఆ రోజు రాజ‌ధాని విష‌య‌మై ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు. అమ‌రావ‌తి నిర్మాణానికి ఎంతో శ్ర‌మించారు. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా పెట్టుబ‌డులు కూడా వ‌చ్చాయి. త‌రువాత ఆయ‌నపై ఉన్న కోపంతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కొన్ని త‌ప్పిదాలు చేసి వాటిని వెన‌క్కు మ‌ళ్లించిన సంద‌ర్భం కూడా ఉంది.
అయినా కూడా టీడీపీని ఎదిరించే స్థాయిలో వైసీపీ ఉంది కానీ వైసీపీని పూర్తి స్థాయిలోనిలువ‌రించేందుకు టీడీపీకి ఉన్న శ‌క్తి అయితే చాల‌డం లేదు. ఈ క్రమంలో టీడీపీ ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి అన్న‌వి చూద్దాం. అంత‌కుమునుపు ఓ సంద‌ర్భంలో యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఏమ‌న్నారో చూద్దాం.

యువ‌త‌ను న‌డిపిస్తున్న ఏకైక నాయ‌కుడు చంద్ర‌బాబు : ఎంపీ రాము

యువ‌త‌ను న‌డిపిస్తున్న ఏకైక నాయ‌కుడు  చంద్ర‌బాబే..దార్శినిక‌త ఉన్న నేత‌గా పేరున్న చంద్ర‌బాబుని మ‌ళ్లీ సీఎంగా చూడాలి. అందుకు అంతా ఏక‌తాటిపై నిలిచి కృషిచేయాలి. నాన్న ఎర్ర‌న్నాయుడు చేసిన సేవ‌ల ఫ‌లితంగా ఆయ‌న వారసుడిగా న‌న్ను ప్రోత్స‌హించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి మీతో నేనుంటా అంటూ ఆ రోజు ఎంతో ప్రోత్స‌హించారు. నాపై ఎంతో న‌మ్మ‌కం ఉంచారు.
ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయక జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నా. యువ‌తని జాగృతం చేసే ఏకైక నేత చంద్ర‌బాబే అని చెప్పేందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఎంద‌రో నాయ‌కుల‌ను క‌ష్ట‌కాలంలో ముందుండి న‌డిపారు. ఈ రోజు మేమంతా ప‌ద‌వుల్లో ఉన్నామంటే కార‌ణం ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కత్వం కీల‌కంగా నిలిచింది. అదేవిధంగా ఆ రోజు  నుంచి ఈ రోజు వ‌ర‌కూ నా వెంటే
తెలుగు యువ‌త న‌డిచింది. యువ‌త నిప్పులాంటి వారు.. వారిలో చైత‌న్యాన్ని నింపి ప్ర‌తి ఇంటికీ ఓ మ‌ణిదీపంలా మార్చేశ‌క్తి నాయ‌క‌త్వానిదే..అటువంటి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం చంద్ర‌బాబుతోనే సాధ్యం. ప‌ద‌వే ధ్యేయం గా ప‌నిచేసే నేత‌ల క‌న్నా రాష్ట్రం కోసం ప‌నిచేసే నేత‌ల‌ను ఎన్నుకోండి..అని చెప్పారాయ‌న.

ముందుగా ఏం తెలుసుకోవాలి

పైన చెప్పిన విధంగా యువ ఎంపీ రాము చెప్పిన విధంగా యువ‌త ను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి. క్షేత్ర స్థాయిలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు గురించి అంతా చెబుతున్నారు కానీ సొంత పార్టీ వైఫ‌ల్యాలు గురించి కూడా టీడీపీ అధినాయ‌క‌త్వం తెలుసుకోవాలి. విభేదాల‌ను చ‌క్క‌దిద్దే ప‌నుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం తెలుసుకోవాలి. జిల్లాలో శ‌క్తిమంతం అయిన నాయ‌కులు ఉన్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అస‌మ‌ర్థుల‌కు పద‌వులు ఇవ్వ‌డం వ్య‌ర్థం అన్న విష‌యం తెలుసుకోవాలి. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసినా కూడా కొన్ని ఒత్తిళ్ల కార‌ణంగా ప‌దే ప‌దే పార్టీలు మారుతున్న నాయ‌కులే సిస‌లు నాయ‌కులుగా చెలామణీ  అవుతుండ‌డ‌మే టీడీపీకి ఉన్న దుర‌దృష్టం.

ఏం నేర్చుకోవాలి

ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలకు బాధ్యుల‌ను నియమించారు క‌నుక వాళ్లే భ‌విష్య‌త్ కాలంలో అంటే 2024లో అభ్య‌ర్థులు అని ప్ర‌భావ‌శీల‌కంగా ప్రొజెక్ట్ చేయ‌డం నేర్చుకోవాలి. ఆ విష‌యం ముందు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి..శ్రేణుల్లోకి వెళ్లాలి..శ్రేణుల అంగీకారం పొందే విధంగా నాయ‌క‌త్వం ఒప్పించ‌డం కూడా నేర్చుకోవాలి. అసంతృప్తులు తాము గెలిచి పార్టీని గెలిపించ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని!
క‌నుక అలాంటి వారిని దూరం పెడుతూ ఉండడం కూడా నేర్చుకోవాలి. కార్పొరేట్ లాబీయింగ్ అన్న‌ది అన్ని పార్టీల‌లో కూడా ఉంది క‌నుక ఏది ఎంత వ‌ర‌కో అంత వ‌ర‌కే అన్న స‌త్యాన్ని పాటించ‌డం కూడా అధినాయ‌క‌త్వం నేర్చుకోవాలి. లేదంటే నారాయ‌ణ లాంటి నాయ‌కులు ప‌దవులు అనుభ‌వించి ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version