Glimpse of LIGER : ‘లైగర్’గా విరుచుకుపడిన దేవరకొండ..ట్రెండింగ్ లో ఫస్ట్ గ్లింప్స్

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

అయితే నిన్న లైగర్ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.  విజయ్ దేవరకొండ “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్..ఈ గ్లింప్స్‌ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చేశాడు. అంతేకాదు.. పవర్‌ ఫుల్‌ బాడీతో… రింగ్‌ లోకి ఎంట్రీ ఇచ్చే సీన్‌ అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను భారీ గా పెంచేశాయి. ప్రస్తుతం “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ యు ట్యూబు లో ట్రేడింగ్ గా మారాయి. గ్లింప్స్ అదిరిపోవడం తో.. నెటిజెన్స్ కూడా తేగ చూస్తున్నారు.   కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version