ఏపీలోని గిరిజన మహిళలకు కష్టాలు తప్పడం లేదు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారు చికిత్స కోసం కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి గిరిజన ప్రాంతాల్లో మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా రేగపుణ్యగిరి గ్రామంలో ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించినట్లు సమాచారం. రోడ్డు మార్గం లేకపోవడంతో 3 కిమీటర్లు డోలీలోనే బంధువులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక మహిళలు పురుడుపోసినట్లు సమాచారం. ఇప్పటికైనా గిరిజనల కోసం రోడ్డు మార్గాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు.