రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు మహిళ ఎగిరి వెళ్లి కింద పడి సైడ్ వాల్‌కు ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళ రాష్ట్రంలోని కొట్టకల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బదరియా అనే మహిళ తన కొడుకుతో కలిసి రోడ్డు పక్కన నడచుకుంటూ వెళ్తున్నది. అదే క్రమంలో రహదారిపై ఓ కారు వేగంగా వచ్చి ఆమెను వెనుకనుంచి ఢీకొట్టింది.అనంతరం బాలుడు తన తల్లి వద్దకు వెళ్లి ఆమెను పైకిలేపే ప్రయత్నం చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకుని బదరియాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మహిళను ఢీకొట్టిన కారు..
కేరళలోని కొట్టకల్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బదరియా అనే మహిళ తన కొడుకుతో కలిసి రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. అనంతరం బాలుడు తన తల్లి వద్దకు వెళ్లి ఆమెను పైకిలేపే… pic.twitter.com/6ZPoNnj6LK
— ChotaNews App (@ChotaNewsApp) May 2, 2025