ఢిల్లీలొ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసారు తెలంగాణ ట్రైబల్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతి కలిసారు ట్రైబల్స్. అనంతరం ఉత్తంకుమార్ రెడ్డిడి మాట్లాడుతూ.. గిరిజనులు 8 ఏళ్లుగా 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నారని తెలిపారు. బిజెపి, టీఆరెస్ లు రిజర్వేషన్లు పెంచక గిరిజనులు ఇబ్బoది పెడుతున్నారని అన్నారు. 50 శాతానికి అదనంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు.
పొడు భూముల సమస్యపై టీఆరెస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చినా.. ఎటువంటి వసతులు లేవని అన్నారు ఉత్తంకుమార్ రెడ్డి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలతో గిరిజనులకు, దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు.