రాష్ట్ర కేబినెట్‌లో గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వాలి : ఎంపీ డీకే అరుణ

-

రాష్ట్ర కేబినెట్‌లో గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. అయితే, ఫిబ్రవరి 15న సేవాలాల్ జ‌యంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గిరిజన సంఘాలు గురువారం ఉదయం ఎంపీ అరుణకు అందించాయి.ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. గిరిజన సంఘాల డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

గిరిజ‌నుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ అభిమ‌తమని, అందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర కేబినెట్‌లో గిరిజనులను అవకాశం ఇవ్వకపోవడం సరికాదని విమర్శించారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్నతికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని వివరించారు.ఫిబ్రవరి 15న సేవాలాల్ మ‌హ‌రాజ్ జ‌యంతిని అధికారికంగా నిర్వహించాలని ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news