నెల్లూరులో దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి..!

-

నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రగతి నగర్ లో దోమల పై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితర పార్టీ నేతలు. మురికి నీటిగుంటలో ఆయిల్ బాల్స్ వేసి మందును స్ప్రే చేసారు శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ పరిధిలో పలువురు దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రులకు లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. కాబట్టి దోమలను నిర్మూలించేందుకు అధికారులు.. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం.

అలాగే త్వరలోనే నీటి గుంటలలో గంబోషియా చేపలను కూడా వదులుతాం. అయితే దోమల నిర్మూలనకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.. దీనికే ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని డివిజన్ లలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇక నగరపాలక సంస్థలో పారిశుద్ధ సిబ్బంది తక్కువ ఉన్నారు. అందువల్ల అదనపు సిబ్బంది నియామకం పై మంత్రి నారాయణ చొరవ తీసుకోవాలి. ప్రస్తుతం రెండే ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి.. కాబట్టి మరిన్ని తెప్పించాలి అని కోరారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news